RPF CONSTABLE & S I SYLLABUS IN TELUGU
కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు సిలబస్ ఒకటే. కాబట్టి ఏక కాలంలో రెండు పోస్టులకు సిద్ధం కావచ్చు. కాకపోతే ఆయా పోస్టులను బట్టి ప్రశ్నల క్లిష్టతలో తేడాలు ఉంటాయి. ఇటీవల యూపీఎస్సీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ - అసిస్టెంట్ కమాండెంట్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, ఎస్‌బీఐ పీఓ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అదేవిధంగా తెలుగు అభ్యర్థులు చాలా మంది పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. వీరందరూ కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడొచ్చు. వారు సాగిస్తున్న ప్రిపరేషన్ ఈ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది.
జనరల్ అవేర్‌నెస్: తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలున్న విభాగమిది. కాబట్టి ఇందులో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే ఉంది (50 మార్కులు).
ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర - సాంకేతిక తదితర రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిమాణాలపై అభ్యర్థుల అవగాహనను ఈ విభాగంలో పరీక్షిస్తారు. ఈ విభాగం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చోటు చేసుకుంటున్న పరిమాణాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా ఇతర దేశాలతో భారత్ చేసుకుంటున్న ఒప్పందాలు, ప్రధాని పర్యటనలు, అవార్డులు, క్రీడలు, శాస్త్ర - సాంకేతిక పరిశోధనలు, ఎన్నికలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చట్టాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలను సమగ్రంగా ఫాలో కావాలి. భారతదేశ చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే కనీసం 50 శాతం ప్రశ్నలకు సమాధానాలను రాబట్టవచ్చు. పదో తరగతిలోని సాంఘిక, సామాన్యశాస్త్ర పాఠ్యాంశాలను చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కోసం రోజూ దినపత్రికలను చదువుకోవాలి. పరీక్ష తేదీకి ముందు ఏడాది కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, భారతీయ రైల్వేల్లో జరిగిన మార్పులు, సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, క్రీడా పతకాల గురించి తెలుసుకోవాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అభ్యర్థుల తార్కిక శక్తిని పరీక్షించే విభాగం. ఇందులో 15 - 20 ప్రశ్నలు సులువుగా చేసేలా ఉంటాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే వేగంతోపాటు కచ్చితత్వం కూడా అవసరం. కాబట్టి సమయాన్ని నిర్దేశించుకొని సమస్యలను సాధించడం నేర్చుకోవాలి. ప్రశ్నలో ఉన్న సమాచారం మొత్తం వినియోగిస్తూ సమాధానాన్ని తీసుకురావాలి. వెర్బల్, నాన్ వెర్బల్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అనాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్స్, రీజనింగ్, నెంబర్ సిరీస్, కోడింగ్ - డికోడింగ్, డేటా సఫిషియెన్సీ, డైరెక్షన్ సెన్స్, ర్యాంకింగ్స్, సీట్ ఆరేంజ్‌మెంట్స్, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రామ్స్, స్పేస్ విజువలైజేషన్, మ్యాచింగ్ వంటి టాపిక్స్‌పై దృష్టి సారించాలి. ఈ విభాగం కోసం బేసిక్ మ్యాథమెటిక్స్, అల్ఫాబెట్ టెస్ట్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్‌లో ఒక టాపిక్‌ను తీసుకుంటే.. దానికి సంబంధించి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ముందే ఊహించుకొని ప్రాక్టీస్ చేయాలి.
అర్థమెటిక్: ఈ విభాగాన్ని అభ్యర్థులు క్లిష్టమైనదిగా భావిస్తారు. ఇందులో అర్థమెటిక్, మేథమేటిక్స్, డేటా అనాలిసిస్ / డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇందులో భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభ - నష్టాలు, నిష్పత్తి, డిస్కౌంట్, పార్ట్‌నర్‌షిప్, వ్యాపార గణితం (వడ్డీ), కాలం - దూరం, కాలం-పని, గ్రాఫ్స్, త్రిభుజాలు, సర్కిల్స్, స్తూపాలు, చతు రస్రం, ధీర్ఘచతురస్రం, పిరమిడ్, ఎత్తు - దూరం, కోణాలు, బార్ - చార్ట్ డయాగ్రామ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ వంటి గణితంలోని ప్రాధమిక భావనలను అవగాహన చేసుకోవాలి. తద్వారా కాలిక్యులేషన్స్ చేయడం సులభమవుతుంది. అన్ని టాపిక్స్‌కు సంబంధించిన ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకుని, వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోవాలి.